టీడీపీతో పొత్తు అంశంపై తులసిరెడ్డి స్పందన!

  • టీడీపీతో పొత్తు అవాస్తవం
  • టీడీపీ, వైసీపీల విధానాలు ఒకటే
  • ఎన్నికల తర్వాత ఈ పార్టీలు బీజేపీ పంచన చేరుతాయి
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దగ్గరవుతున్నాయని... రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. టీడీపీతో పొత్తు గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని చెప్పారు.

టీడీపీ, వైసీపీల విధానాలు ఒకటేనని ఆయన అన్నారు. బీజేపీకి టీడీపీ అధికారిక మిత్రపక్షమైతే, వైసీపీ అనధికార మిత్రపక్షమని చెప్పారు. ఎన్నికల కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు బీజేపీ పంచన చేరుతాయని చెప్పారు. టీడీపీ తన పేరును 'తెలుగు ద్రోహుల పార్టీ'గా మార్చుకోవాలని సూచించారు. నకిలీ, కబ్జాకోరు పార్టీ వైసీపీ అని విమర్శించారు.
Go Back to Shorts
tulasi reddy
YSRCP
Telugudesam
congress
bjp

More Telugu News